Trinethram News : రైలు ప్రయాణాల్లో అనిశ్చితిని తగ్గించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు తయారుచేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు 10 గంటల ముందుగానే ఖరారు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణికులు తమ టికెట్ స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కొత్త టైమింగ్స్ ప్రకారం, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా, మిగిలిన రైళ్లకు కనీసం 10 గంటల ముందుగా రూపొందించాలని రైల్వే బోర్డు తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


