విద్యతోనే గిరిజన పిల్లల భవిష్యత్తు మారుతుందన్న లక్ష్యంతో సేవలు

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 17 (త్రినేత్రం న్యూస్): వే మేకర్స్ ఫౌండేషన్ చైర్మన్ యేసుదాసు (హైదరాబాద్) వారి సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెల పంచాయతీ గన్నెల గ్రామంలో మంగళవారం సామాజిక సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గన్నెల గ్రామంలోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 119 మంది గిరిజన విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని వితంతు మహిళలకు చీరలు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని తడబారికి అప్పలస్వామి, శామ్యూల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వే మేకర్స్ ఫౌండేషన్ చైర్మన్ యేసుదాసు మరియు వారి బృందం ఆర్థిక సహకారం అందించారు. విద్యతోనే గిరిజన పిల్లల భవిష్యత్తు మారుతుందన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా డుంబ్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో కూడా మహిళలకు చీరలు, పిల్లలకు నోటుపుస్తకాలు, స్టేషనరీ కిట్లు పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గిరిజన పిల్లల తల్లిదండ్రులు పాల్గొని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

aim of changing the future of tribal children

You cannot copy content of this page

Scroll to Top