త్రినేత్రం న్యూస్, మండపేట: వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తే మన సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు అన్యాయం చేసిన మీరు మాట్లాడే స్థాయి లేదని 8వ వార్డు కౌన్సిలర్ నియోజకవర్గ ఆర్టీఐ అధ్యక్షులు మందపల్లి రవి కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కనికెళ్ళ పల్లవి ప్రసాద్ లు తీవ్రంగా ఖండించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తో నెగ్గిన నువ్వు 60 లక్షలు నిధులు నీ వార్డు కి వేచ్చిస్తే కాంట్రాక్టర్ ని చేయనివ్వకుండా నేనే చేయిస్తానని ఆ వార్డు అభివృద్ధిని అడ్డుకున్న అవకాశవాదివి నువ్వు కాదా అని ఎద్దేవా చేశారు. కౌన్సిలర్ స్థాయి నీకు లేనప్పటికీ మా రాజకీయ పెద్దల అండదండలతో టిక్కెట్ సంపాదించి నెగ్గిన మీరు మా నాయకునికి వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయించావన్నారు. అక్కడైనా దిగజారుడు రాజకీయాలతో వెన్నుపోటు పొడిచే ఆలోచన చేయకుండా మసులుకోమని హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ కూడా మన ఎస్సీ నిధులను విడుదల చేయలేని దుస్థితిలో ఉందని, దానిని ప్రశ్నించకుండా అసందర్భంగా వాదించడం మీ మూర్ఖత్వానికి నిదర్శనమని మందపల్లి రవి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోట త్రిమూర్తులు హయాంలో 8వ వార్డు ఎస్సీ పేట లో సుమారు 70 లక్షల అభివృద్ధి పనులు చేసామని గుర్తు చేశారు. సిసి రోడ్లు, మరుగుదొడ్లు మరమ్మత్తులు, గ్రావెల్ రోడ్లు పెయింటింగ్స్, కల్వర్ట్లు పనులను చేసినవి మీ కళ్ళకు పసుపు మసకతో కప్పేస్తే మేమేం చేస్తామన్నారు. తోట త్రిమూర్తులు నడిరోడ్డు మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరాం విగ్రహాలు పెట్టి మన జాతి విలువలను పెంచారన్నారు. నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయినా వేగుళ్ళకు ఇటువంటి ఆలోచన రాలేదని, జాతికి గౌరవాన్ని అభివృద్ధిని ఎవరిచ్చారన్నది గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.
కొవ్వాడ బేబీ అప్పన్న బాబుకు నీతి నిజాయితీల గురించి మాట్లాడే నైతిక విలువలు లేవని మన దళిత ప్రజలు అభివృద్ధి కి కౌన్సిల్లోకి పంపిన కౌన్సిలర్ గా మన జాతి బిడ్డగా రవికుమార్ మన ఓడల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఆటంకం కలిగించే వారిపై కోర్టు ద్వారా సమాధానం చెబుతూ సాహసోపేతంగా అభివృద్ధికి పాటుపడుతున్న మన దళిత కౌన్సిలర్ రవిపై మీరు చేస్తున్న ఆరోపణలు దళిత వ్యతిరేక పద్ధతిగా ఉందని అసలు మీరు కౌన్సిలర్ గా ఉండి ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేశావు అనేది నీ మనస్సాక్షి కే వదిలేస్తున్నామని నీలాంటి అసమర్థ కౌన్సిలర్ నీ ఇప్పటివరకు మేము చూడలేదని మన దళితులంతా నిన్ను అసహ్యించుకుంటున్నారని కనికెళ్ల పల్లవి ప్రసాద్ లు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గునిపే శ్యామ్ సుందర్, పోలమాల సత్తిబాబు లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


