Medical Camp : ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే మెడికల్ క్యాంప్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా :కావలి.. బోగోలు మండలం : కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్పెషల్ క్యాంపులో భాగంగా 3వ రోజు కొండ బిట్రగుంట గ్రామంలో గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ బుచ్చిరెడ్డిపాలెం వారి సౌజన్యంతో కావలి రెడ్ క్రాస్ వారి సహాయ సహకారాలతో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి .వి. ఎన్. రెడ్డి తెలిపారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం లో హోమియో డిస్పెన్సరీ లో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ జి. జ్ఞాన ప్రసూన పాల్గొని సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధులను గ్రామస్తులకు తెలియజేసి నివారణ చర్యలుగా హోమియో మందులను గ్రామస్తులందరికీ అందజేశారని తెలిపారు.

అలాగే కావలి రెడ్ క్రాస్ వారు పాల్గొని గ్రామస్తులకి బ్లడ్ గ్రూప్ తో పాటు హిమోగ్లోబిన్, షుగరు, బిపి లాంటి టెస్ట్ లు కూడా చేసి అవసరమైన వారికి మందులు కూడా సూచించడం మరియు ఉచితంగా ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త ఏ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ వారి మెడికల్ సిబ్బంది, గ్రామస్తులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medical Camp by NSS Students

You cannot copy content of this page

Scroll to Top