అరకులోయ డిసెంబర్ 11,(త్రినేత్రం న్యూస్) : జాతీయ పిసా మహోత్సవ క్రీడా పోటీలలో భాగంగా అల్లూరి సీతారామ రాజు జిల్లా నుంచి జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు, విశాఖపట్నంలో క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. మారథాన్ విభాగంలో పి. శివాజీ (అరకు డిగ్రీ కళాశాల), డి. ఆనంద్ రాజు (పాడేరు డిగ్రీ కళాశాల), అలాగే పి. నీలవేణి, యస్. మంజుల, ఎల్. జ్యోతి పిడి. బాలికల డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
కబడ్డి విభాగంలో ఎం. కార్తీక్, జి. లోక్నాద్, పి. హేజేకియా, యు. అనిల్, కె. గణేష్, కె. చంద్రు బాబు, పి. మల్లికార్జున్ (పాడేరు డిగ్రీ కళాశాల విద్యార్థులు) ప్రతిభ కనబరిచారు. అలాగే అరకు బాలికల డిగ్రీ కళాశాల నుండి యస్. మంజుల, కె. అనిత, పి. నీలవేణి, పి. జ్యోతి, కె. ఝాన్సీ రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన చేత జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీలకు వీరు అర్హత పొందినట్లు అల్లూరి సీతారామ రాజు జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, క్రీడా అభివృద్ధి అధికారి ఎ. జగన్ మోహనరావు, జిల్లా పంచాయతీ అధికారి, పాడేరు డివిజన్ అధికారులు ఈ క్రీడాకారులను అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “గిరి విద్యార్థులు క్రీడల్లో మరింత ప్రతిభ చాటుతూ అల్లూరి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలి. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ చూపాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


