Leela Krishna : విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న లీలాకృష్ణ, దంపతులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, దంపతులు దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులతో కలిసి అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అమ్మ‌వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వుండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leela Krishna and his wife visited Kanakadurgamma in Vijayawada

You cannot copy content of this page

Scroll to Top