Trinthram News : కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆమెకు చెందుతుందని, సోనియా గాంధీ సేవలు ఎనలేనివని నాయకులు కొనియాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ త్రినాథ్, రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ వి వి కమలాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఆనంద్ కుమార్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, సీనియర్ నాయకులు కస్తూరి వెంకట్ రావు,చెన్న అప్పారావు, భోగవరపు శ్రీనివాస్, డా జీ పవన్ కుమార్, గుర్రం కనకరాజు, పర్వీన్ ఖాన్,విన్సెంట్ కమలాకర్, డీసీసీ ఆఫీస్ ఇంచార్జ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


