ఆంధ్రుల భవిష్యత్ ను దోచుకుంటున్న నేతలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి సాగనంపేద్దాం ..
భూమి హక్కును సొంతం చేసుకుంద్దాం . సంపదను సాధిద్దాం . కడలి వలే ఉప్పొంగిన ఆంధ్ర పౌరుషాన్ని గెలిపిద్దాం..
పాలనను సంస్కరించుకుంద్దాం . పూర్తి రాజకీయ మార్పును సాధిద్దాం . రాజకీయ కట్టప్పలను ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమేద్దాం .
మేడా శ్రీనివాస్ , పిలుపు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ,
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 7 : రాజమహేంద్రవరం, జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దాం . ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను సాధిద్దాం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రులను కోరారు ..
ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ , ఎమ్మెల్యే సభ్యుల్లో అనేకమంది వందల కోట్లకు అధిపతుల మంటు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నప్పటికి చేవ లేని జీవితాలతో చేవ చచ్చి చట్ట సభల్లో ప్రజల కష్టాన్ని జీతాలుగా తీసుకుంటు సుఖ భోగాలు అనుభవిస్తున్నారు . పార్లమెంట్ లో ఏ ఒక్క ఎంపి అయినా ప్రత్యేక హోదా, విభజన హామీలు కోసం గళమెత్తిన సందర్బలు ఉన్నాయా ! పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధన కోసం, డివిజన్ తో కూడిన రైల్వే జోన్ , రామాయపట్నం మేజర్ పోర్ట్ , పూర్తిస్తాయి ప్రభుత్వ సంస్థగా కడప ఉక్కు ఫ్యాక్టరి , క్యేప్టివ్ మైన్స్ తో గల పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగానే విశాఖ ఉక్కు నిర్వహణ , హైదరాబాద్ లోగల సుమారు లక్ష కోట్లు పైభడిన 52% , 48% నిష్పత్తి వాటా గల విభజన ఆర్థిక వాటా , 38 వేల కోట్ల కాకినాడ పెట్రో కెమికల్ కంపెక్స్ , ఇంకా అనేక విభజన హామీల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంట్ లో గళమెత్తిన ఏ ఒక్క ఎంపి అయినా ఉన్నారా ! అదే స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యే లు సైతం
మన ఎంపి లతో సమానంగా పోటి పడుతూ ప్రజల కష్టాన్ని జీతాలుగా తీసుకుంటున్నారు . చేవ లేని చేవ చచ్చి బ్రతుకుతున్న మన పోకచెక్క నేతలకు ఆంధ్ర రాష్ట్ర ఘన చరిత్రను , ఆంధ్రుల త్యాగాలను, ఆంధ్రుల పౌరుషాన్ని , వారి ఆగ్రహాన్ని గుర్తు చేయాల్సిన సమయం ఆశన్నమైనది . మన ఎంపి లు, ఎమ్మెల్యే ల కన్నా సర్పంచ్ లు, కౌన్సిలర్స్ కొంతమేరకు ఆత్మభిమానంతో ప్రజలకు అందుబాటులో వుంటు వారి భాద్యతలను నిర్వహిస్తున్నారని , ఎమ్మెల్యే , ఎంపి ల్లో మార్పు రాకపోతే మరో నేపాల్, శ్రీలంక ఉద్యమ తిరుగుబాట్లు తప్పవువని , ఉరికించుకుంటారో , ప్రత్యేక హోదా , విభజన హామీల కోసం పార్లమెంట్, అసెంబ్లీ ల్లో గళ మెత్తుతారో నేతలే నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చిరించారు .
ఆంధ్రుల మోనం , సహనం ఆంధ్ర రాష్ట్ర సంపదను, మన బిడ్డల భవిష్యత్ ను దోచుకోవటానికి మనమే మార్గం చేస్తున్నట్టుగా వుంది . ప్రస్తుత పాలకుల్లో ప్రధాన నేతలకు ఆంధ్రప్రదేశ్ మట్టి వాసన తెలవదు. రాజకీయాలను మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో సాశిస్తుంటారు. వీరి నివాసాలు , ఆస్తులు, వ్యాపారాలు మొత్తం ప్రక్క రాష్ట్రం లోనే . వీరికి అవసరం అయినప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతు సొంత ప్రయోజనాలు పొడుతున్నారు . కేసీఆర్ వంటి వారి విష వారసులను అవసరం మేరకు రెచ్చ గోడుతూ ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తు వారి సొంత రాజకీయ ప్రయోజనాలను సాధించుకుంటున్నారు . ప్రస్తుత పాలకులకు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ , ఆత్మగౌరవం కన్నా వారి కుటుంబాలకు తర తరాలు తరగని ఆస్తులు , రాజకీయ అధికారమే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ను సర్వనాశనం చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతి స్టేడియం వద్ద ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో ఒక ప్రాంతీయ మీడియా ముసుగు ఉన్మాది జరిపిన దాడి ని తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరు ఖండించకపోవటం వారి విష రాజకీయాలకు నిదర్శనం . ఆంధ్ర రాష్ట్రంలో గల అపార సంపదను ఇతర రాష్ట్రాల రాజకీయ అవసరాలకు దోచిపెట్టడానికి , మన ఆంధ్రుల శ్రమను సొంత మార్గాలకు దారి మళ్ళించుకోవటానికి మాత్రమే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు . ఆంధ్ర రాష్ట్రం నుండి ప్రాతినిత్యం వహిస్తున్న ఎంపి లు, ఎమ్మెల్యే లు సొంత నియోజకవర్గాల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగం లేదు . కనీసం ఇంటి పనిమనిషి కి వున్న విశ్వాసం కూడా మన రాష్ట్రం నుండి చట్ట సభల్లో ప్రాతినిత్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులకు లేక పోతుందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .
పూర్తి స్థాయి రాజకీయ మార్పుతో ఆంధ్రప్రదేశ్ లో సంపదను సృష్టిద్దాం , సంపదను సాధిద్దాం . భూమి హక్కును సామాన్యుల సొంతం చేద్దాం . గతించిన ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని ఢిల్లీ పాలకులకు రుచి చూపిద్దాం. బానిసలుగాను , నిరు పేదలగాను, అంటరాని వారిగాను బ్రతకటం కన్నా బిడ్డల అభ్యున్నతి కోసం , ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం పేదరికం లేని సమాజాన్ని సాధించుకుంద్దాం . ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతికి పదంలో నడిపిద్దాం . చేవ లేని, పౌరుషం లేని , సత్తా లేని నర్తనశాల నేతలకు జై జేలు కొట్టటం మానేసి సమర్డులైన నేతలకు పట్టం కట్టి ఇన్నాళ్లు చట్ట సభలకు పట్టిన కళంకాన్ని తుడిచిద్దాం . కదలి వలే ఉప్పొంగిన ఆంధ్రుల పౌరుషాన్ని కడలి కెరటాలకు చూపిద్దాం . ఆంధ్ర రాష్ట్ర నేతలు మాత్రమే పౌరుషం చచ్చి బ్రతుకుతున్నారు . ఆంధ్రులు కారు అని యావత్ ప్రపంచానికి చాటిచెప్పుదాం . మన రాష్ట్ర సంపద మనది కావాలి . ఇతరుల దోపిడీకి కాదు అని నిరూపిద్దాం . ఆంధ్రుల మంచితనాన్ని అగౌరవ పరిస్తే ఆధ్రుల తిరుగుబాటు దేశ వ్యాప్తంగా ఆదర్శం కాగలదని ఆయన సూటిగా హెచ్చిరించారు ..
పూర్తి స్థాయి రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్ లో మొదలవుతుందని , దొరల పాలనకు చమరగీతం తప్పదని , పాలనను ములాల్లో నుండి సంస్కరించుకుంటామని , ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కట్టప్పలకు కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయని గుర్తు చేసారు . ఆంధ్రప్రదేశ్ లో గల 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోను జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తిని తీసుకొస్తామని , ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ను సంపన్న రాష్ట్రంగా నిరూపించటం తద్యమని, జై ఆంధ్ర నినాదం స్వాతంత్ర్య పోరాటానికి నాందిగా నిలిచిన వందేమాతరం అనే వజ్ర సంకల్పంగా ఆంధ్రులు బావించే రోజులు ముందు ముందు వున్నాయని , 2029 నాటి చట్ట సభల్లో సమర్డులైన యోధులు ప్రాతినిత్యం వహించటం ఖాయమని , ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కేరఫ్ హైదరాబాద్ వ్యాపార రాజకీయ పార్టిలు కనుమరుగవ్వటం తప్పదని , జై ఆంధ్రప్రదేశ్ , సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం ప్రతి ఆంధ్రుడి గురుతర బాధ్యతగా చేతబూనే విధంగా ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ దిశగా ఇప్పటికే ఎంతో మంది స్వచ్ఛమైన ఆంధ్రుల తోను , యువత తోను సంప్రదింపులు విస్తృతంగా జరుగుతున్నాయని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్త పరిచారు ..
సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి, ఎమ్ డి హుస్సేన్, దుడ్డే సురేష్, బర్ల సతీష్ , దోషి నిషాంత్ , వాడపల్లి జ్యోతిష్ , గుడ్ల సాయి దుర్గాప్రసాద్ , దుడ్డే త్రినాద్ , బసా సోనియా , వల్లి శ్రీనివాసరావు, యర్రా బాల మురళి కృష్ణ , అల్లాడ రమేష్ , మాసా అప్పాయమ్మ , సుంకర వెంకట భాస్కర రంగారావు , కాకర ప్రసాద్ , కూరాకుల నాగమణి, కందివలస రమణ, కందివలస హైమావతి , మేకల కిరణ్ కుమార్, తదితరులు పాల్గొనియున్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


