అన్నదాతకు చేయూత కరువు…… ప్రచార దరువు
“రైతన్న…. మీకోసం” కార్యక్రమాలు ప్రచార వేదికలుగా మారిపోయాయి అని అన్నా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 06, అనపర్తి నియోజకవర్గం, రాష్ట్రంలోని కోటము ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహించిన “రైతన్న…. మీకోసం”కార్యక్రమాలు ప్రభుత్వ ప్రచార వేదికలుగా మారిపోయాయని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్య రెడ్డి ఆరోపించారు అరచేతిలో వైకుంఠం చూపించడం, అబద్దాలతో మోసం చేయడం, రైతుల చెవుల్లో పూలు పెట్టడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు “రైతన్న…. మీకోసం” పేరుతో లేని గొప్పలు చెప్పుకునేందుకు వేసిన ఎత్తుగడలు విఫలమయ్యాయని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, పంచ సూత్రాలు రక్షంగా కార్యక్రమాన్ని రూపొందించి ప్రజా ప్రతినిధులందరూ. ఇంటింటికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించిన…. అన్నదాతలకు, పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్న అప నమ్మకం ఒకటైతే…. ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు లేక ఆవేశంతో మిగిలిపోతున్న అన్నదాత వద్దకు వెళ్తే ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని కోటమి నేతలు భయపడుతున్నారని డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పొగాకు మిర్చి మామిడి టమాట అరటి ఇలా రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని. దీనికి తోడు వరుస తుఫానులతో కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోలేకపోయినా ప్రభుత్వం సొంత ప్రచారం కోసం కోట్లు కుమ్మరించడం దారుణమన్నారు రైతుకు మేలు చేయాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు ప్రకృతి విపత్తుకు మించి అన్నదాతకు నారా విపత్తు ప్రమాదమని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతుకు ఒరిగింది శూన్యమని అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టినా చాలామంది రైతులకు అనేక కారణాల నేపథం దక్కడం లేదన్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిబంధనలు కూతలు పేరుతో అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ అందరి పరిస్థితిలో ఏమన్నారు ఇటీవల ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రభుత్వం పెట్టుబాటు సాయం లోనూ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు రైతు పంట కన్నీరు రాష్ట్రానికి తేటని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు సంబంధించి ఏటా మే నెలలోనే పెట్టుబడి సాయం కింద పంట సాగుకు సాయం అందించడం జరిగింది. అన్నారు కోటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన దాదాపు ఏడాది వరకు అన్నదాతకు సుఖీభవ అందలేదని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం రైతన్నకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచిందని డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే రైస్ మిల్లర్ల నుంచి నిధులు తీసుకోవడంతో ధాన్యం ధర విషయాలలో మాట్లాడలేని స్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రైతులకు సీఎంఆర్ ద్వారా రూ.1800 వరకు రావాల్సి ఉండగా మెల్లర్లతో ఎమ్మెల్యే కుమ్మకు కావడంతో రూ.1400 నుంచి రూ.1450 మాత్రమే రైతులకు దక్కుతుందన్నారు దీంతో రైతు శ్రమదోపిడి జరుగుతుందని. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


