త్రినేత్రం న్యూస్ :నవంబర్ 29: నెల్లూరు జిల్లా: కావలి :పట్టణంలో యువ న్యాయవాదుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది బెజవాడ అభిసాగర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే కేవలం ఒక్క బహుజనులకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయం అని కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ బాబూరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే యొక్క ఉన్నతమైన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించి నవ సమాజానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుంజి నరేష్, రామ్ వినోద్ కుమార్, అనుమలశెట్టి శ్రీనివాసులు, సుకుమార్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బాబూరావు, సాయిరాం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


