నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
Trinethram News : అమరావతి : రాజధాని అమరావతిలో 15 జాతీయ బ్యాంకుల కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారా లోకేష్, కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటు వల్ల పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల పెరుగుదలతో పాటు రాజధానికి ఆర్థిక బలాన్ని అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికార నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


