అరకులోయ,నవంబర్ 27, (త్రినేత్రం న్యూస్): అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని కిన్నంగుడ, కె.బెడగుడ గ్రామాల్లో శారద ట్రస్ట్ ఆధ్వర్యంలో, దివిస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం సౌజన్యంతో జలధర మంచినీటి స్కీమ్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దివిస్ లేబరేటరీ జనరల్ మేనేజర్ వై. కోటేశ్వరరావు, మాట్లాడుతూ “గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల ఆరోగ్యం మా కంపెనీకి అత్యంత ప్రాధాన్యం. ఈ గ్రామంలో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు శాశ్వత పరిష్కారంగా జలధార స్కీమ్ ఏర్పాటు చేసాము. గిరిజనులు ఆరోగ్యంగా ఉండటం మా బాధ్యతగా భావిస్తున్నాము” అని తెలిపారు.
గ్రామంలో సుమారు 50 కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా రోజువారీగా పరిశుద్ధమైన తాగునీరు అందనుండటం పట్ల స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. “ఇన్నాళ్లుగా నీటి కోసం పడుతున్న కష్టాలకు ముగింపు లభించింది. మా గ్రామాన్ని గుర్తించిన శారద ట్రస్ట్, దివిస్ లేబరేటరీ యాజమాన్యానికి కోటి హృదయపూర్వక నమస్కారాలు” అని గిరిజనులు తెలిపారు.
గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు మాట్లాడుతూ“గిరిజన గ్రామాలకు ఇలాంటి సేవలు అందించడం అనేది అభివృద్ధి దిశగా పెద్ద ముందడుగు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు కూడా నీటి కష్టాలు తొలగించే కార్యక్రమాలు శారద ట్రస్టు ఆధ్వర్యంలో చేపడితే గిరిజన గ్రామాలకు మరింత మేలు జరుగుతుంది” అని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కె. చిన్నం నాయుడు, దామోదర్, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు, సిఐటియు ఉమామహేశ్వరరావు , సిహెచ్. గురుమూర్తి, పి. నాని బాబు, వార్డు మెంబర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు ప్రత్యేకంగా శారద ట్రస్ట్, దివిస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


