Kidari Shravankumar : గిరిజన రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబాటు: జీసీసీ చైర్మన్ కిడారీ శ్రవణ్‌కుమార్

TRINETHRAM NEWS

అనంతగిరి నవంబర్ 27, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం, ఎగువ శోభ పంచాయితీ బిసుపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీసీసీ చైర్మన్, మాజీ మంత్రి కిడారీ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లభించే ₹6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం అందించే ₹14,000తో మొత్తం ₹20,000ను మూడు దఫాలుగా చిన్న, సన్నకారు రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమమని విశ్వసించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్నారని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం లబ్ధి చేకూరేలా సచివాలయ సిబ్బంది, మండల కూటమి నాయకులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇటీవల కాఫీ పంటలో వచ్చిన తెగుళ్ల నిర్మూలనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి, తెదేపా మండల అధ్యక్షుడు సుబ్బారావు, నాయకులు జి. నరేంద్ర, మట్టం శ్యామ్ తదితరులు, అధికారులు, స్థానిక గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government is committed to welfare of tribal farmers

You cannot copy content of this page

Scroll to Top