MLA TRR : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డిని కలిసిన ధారాసింగ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి నివాసంలో నూతనంగా నియమితులైన వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ పరిగి ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధారాసింగ్ నాయక్ కు శుభాకాంక్షలు తెలియజేసి, వికారాబాద్ జిల్లాలో గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చుకుని కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీ రామ్మోహన్ కీ ధారాసింగ్ నాయక్ గకృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dharasingh meets MLA T Rammohan Reddy

You cannot copy content of this page

Scroll to Top