వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. బీసీలను నమ్మించి మోసగించిన బిజెపి,కాంగ్రెస్ లను చరిత్ర గుర్తుపెట్టుకుంది బీసీలను సర్పంచ్ లుగా కాకుండా ఆ రెండు పార్టీలు కుట్ర ఫలితమే జీవో 46 విడుదల కాంగ్రెస్ బిజెపిల మోసాలపై బీసీ సమాజం మేల్కొనాలి 23న రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ 46 ప్రతులను దగ్ధం బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచి ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు పరిమితి యాబై శాతం మించకూడదనీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నలబై ఆరు విడుదల చేయడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కాంగ్రెస్ బిజెపిల మోసం ఫలితమే జీవో నెంబర్ నలబై ఆరు విడుదల అయిందని బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు
తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా అరవై శాతం ఉన్న,బీసీలకు నలబై రెండు% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని మొన్నటికి మొన్న విడుదల చేసిందనీ, ఇప్పుడు తొమ్మిది జీవోను రద్దు చేసి నలబై ఆరు జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అంచవేతకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో రెడ్లను ఎక్కువ మంది సర్పంచులుగా చేసి, సర్పంచ్ నుండి ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉన్న వారి ప్రయోజనాల కోసమే జీవో నెంబర్46ఉపయోగపడుతుందని ఈ జీవో బీసీలకు రాజకీయ కొలుతాడు లాంటిదని ఆయన మండిపడ్డారు
బిజెపి,కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు పలికారని, రాష్ట్ర బంద్ లో భాగస్వామ్యం అయ్యారని, ఇదే స్ఫూర్తితో జాతీయ పార్టీలు అయిన వీరు పార్లమెంటులో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప చేయడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు పెద్దవద్దమైన రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం ఉండేదని, కానీ ఏమి ప్రయత్నించకుండా రిజర్వేషన్ల విషయంలో రెండు పార్టీలు కలిసి బీసీలను బలి పశువు చేశాయని ఆయన ఆరోపించారు
జీవో నెంబర్ నలభై ఆరు ను తక్షణమే రద్దు చేయాలని, జీవో నెంబర్ 9 మాత్రమే అమలు చేయాలి ఆయన డిమాండ్ చేశారు జీవో నెంబర్ 44 విడుదలను వ్యతిరేకిస్తూ రేపు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీవో ప్రతులను దగ్ధం చేసి బీసీ సమాజం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసనను తెలపాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


