MLA Balu Naik : కార్తీకమాస మహాపూజ

TRINETHRAM NEWS
ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ డివిజన్ నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. కార్తీకమాసం ముగింపు సందర్భంగా దేవరకొండ పట్టణంలోని స్థానిక శివాలయంలో ఘనంగా నిర్వహించిన మహాపూజ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే ని ఆశీర్వదించి తీర్థ–ప్రసాదాలు అందజేశారు. కార్తీకమాసంలో భక్తి తపస్సు, దానం అత్యంత పున్యప్రదమని, దేవాలయాల్లో నిర్వహించే ఈ శుభకార్యాలు ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, టీపీసీసీ సభ్యులు డా. వేణుందర్ రెడ్డి, పానుగంటి మల్లయ్య, శీల వెంకన్న, కర్నాటి పురుషోత్తం, బెజవాడ నరేందర్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kartikamasa Mahapooja

You cannot copy content of this page

Scroll to Top