త్రినేత్రం న్యూస్. కడియం మండలం మాధవరాయడుపాలెం లో వేంచేసియున్న వీర ఆంజనేయస్వామి ఆలయ అయిదవ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త, గ్రామ సర్పంచ్ ఆన్నందేవుల చంటి,విజయ దంపతులు, కుమారుడు విజయ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి కుమారుడు విజయ కృష్ణ వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్తీక మాసంలో ఇటువంటి అన్నసమారాధన నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, టిడిపి,జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, ముద్రగడ జమీ,కూటమి నాయకులు డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, గొల్లపల్లి శీను,ధర్మాసనం శివ, ఎంపీడీవో కె. రమేష్,డిప్యూటీ ఎంపిడివొ ఎన్.శ్రీనివాస్, గ్రామ నాయకులు అన్నందేవుల పెదబాబు, రాంబాబు,బాబి, వట్టికూట్టి దత్తుడు పడాల బాబి తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


