Awareness about Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మోసాలపై అవగాహన

TRINETHRAM NEWS

తేదీ : 15/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, మండలం, ముష్టికుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాల పట్ల ఎస్సై కెవిజివి. సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలియని ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, తప్పు ఓటిపిల గురించి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలోఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సూచించారు. ఆన్లైన్ భద్రత గురించి కూడా వివరించడం జరిగింది.

సైబర్ ఫిర్యాదుల కోసం 1930 , అదేవిధంగా హెల్ప్ లైన్ పి ఓ సి ఎస్ ఓ చట్టంపై ట్రాఫిక్ భద్రత అవగాహన, మంచి టచ్, చెడు టచ్ , ప్రవర్తన మరియు వ్యక్తిగత వ్యవహారం, ప్రాథమిక స్వీయ రక్షణ పాఠాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, మహిళా పోలీస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness on the frauds of cyber criminals

You cannot copy content of this page

Scroll to Top