Warangal News : డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బి సాంబశివరావు కు సమ్మె నోటీసు అందజేసిన

TRINETHRAM NEWS

డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బి సాంబశివరావు కు సమ్మె నోటీసు అందజేసిన వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అసోసియేషన్ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ స్వప్న

15వ తేదీలోపు వేతనాలు ఇస్తే సరే లేకుంటే 17న సమ్మెకు సిద్ధంగా ఉండాలి

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బి సాంబశివరావు కు సమ్మె నోటీసు అందజేసిన వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ స్వప్న మరియు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ..ఇవాళ , రేపు రెండు రోజుల్లో లోపు 2 నెలల వేతనాలు అనగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ జీతాలు ప్రభుత్వం చెల్లించక పోతే ,17 నవంబర్ 2025 సోమవారం రోజున హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందట మహాధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. భాగ్యలక్ష్మి , జాయింట్ సెక్రెటరీ మున్నూరు శ్రీనివాస్ ,ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DM&HO issues strike notice to Dr. B Sambasiva Rao

You cannot copy content of this page

Scroll to Top