శాలువాతో సన్మానించి,శుభాకాంక్షలు తెలిపిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య.
కూకట్పల్లి ప్రతినిధి నవంబర్ 13, (త్రినేత్రం న్యూస్) : మేడ్చల్ జిల్లా బీజేపీ స్వచ్ఛ భారత్ కన్వీనర్, కెపిహెచ్బి 114 డివిజన్ కన్వీనర్ గురు ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు కెపిహెచ్బిలోని సిబిసిఐడి బీఆర్ మెడోస్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు హాజరై శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ ప్రజా సేవలో ఆయన చూపిస్తున్న చురుకుదనం, యువ కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, స్థానికులు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


