Dr. Satthi : ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం, ఆగదు

TRINETHRAM NEWS

అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వెల్లడి

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ

12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

త్రినేత్రం న్యూస్, నవంబర్ 09, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ప్రజా ఉద్యమం పేరుతో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వెల్లడించారు . ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈరోజు అనపర్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి ప్రజాఉద్యమం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అందరూ ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం, ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరుతామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలన ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతోందన్నారు. వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి, పేద విద్యార్థులకు వైద్య విద్య కోసం, పేదప్రజల ఆరోగ్యం కోసం 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారని, వాటిని ప్రైవేటీకరించాలని చంద్రబాబు చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరిస్తున్నట్టు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు.

పాలకులు బాధ్యతారాహిత్యంగా ఉంటే వారి వైఫల్యాన్ని తెలియజేసే పాత్ర ప్రతిపక్షం నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీన రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి, సంబంధిత ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రజల తరపున చేస్తున్న ఉద్యమానికి అంతా సహకరించాలని కోరుతున్నామన్నారు. ప్రజల ఆస్తిని ఇష్టానుసారం అమ్మేస్తున్న చంద్రబాబుకు ఒక గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి (అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి), సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు )(అనపర్తి మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్), నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణ రెడ్డి (మురళి) – వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి టౌన్ అధ్యక్షులు,కొల్లాటి ఇజ్రాయిల్ (రాష్ట్ర సెక్రెటరీ), అద్దంకి ముక్తేశ్వరరావు (రాష్ట్ర సెక్రెటరీ(పార్లమెంట్)),బొడ్డు ముత్యాలరావు(వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ), పాలాటి నాగేశ్వరరావు (జిల్లా పంచాయతీ విభాగ అధ్యక్షులు), పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి) (బిక్కవోలు మండలం కన్వీనర్), గుత్తుల రమణ (పెదపూడి మండలం కన్వీనర్), కొండేటి భీమేష్ (ఎంపీటీసీ సభ్యులు), ఇమ్మంది విజయ కుమారి (నియోజవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు), కొల్లాటి శ్యామలావతి, కంటి వీర వెంకట సత్యనారాయణ, తొండాపు గాంధీరెడ్డి, గురు నాగు, శాఖ రాజు, కడియం గోవిందు, నాళం శ్రీను, కొర్ల వీర శేఖర్, కొర్ల రామచంద్ర రావు, కొర్ల సుబ్బారామయ్య,మహిపాల సీతారాముడు,సుందరనాడి మణికంఠ,కొర్ల నాగు,వలమల వీరన్న,గుత్తుల సత్తిబాబు, తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The struggle will not stop until the government comes down

You cannot copy content of this page

Scroll to Top