నమోదును వెంటనే వెనక్కి తీసుకోవాలి
బీసీ కమీషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నేతలపై పెట్టిన అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు.
చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ లో తాండూర్ ప్రాంతం చెందినవారు మృతి చెందడం బాధాకరమన్నారు. అప్ప జంక్షన్ నుంచి వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. రోడ్డు బాగా లేకపోవడం వల్లే అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నేతలు ఆందోళన చేపట్టారన్నారు. ప్రభుత్వం వెంటనే రోడ్లు బాగా చేయాలి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం పై నిరసన చేస్తే అక్రమ కేసు పెట్టడమేంటని..? ఆయన ప్రశ్నించారు.
రోడ్డు బాగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ అయినా ప్రభుత్వం అమాయకుల ప్రాణాలు పోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. తాండూరు విలియమూన్ చౌరస్తా వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్న వారిపై కేసు పెట్టడం హేయమైన చర్య అని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే.. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


