మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సభలపోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్బంగా పిడిఎసు (విజృంభణ)మంచిర్యాల జిల్లాఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కే. మహేష్ మాట్లాడుతూ నవంబర్ మాసం విప్లవ పోరాటంలో అసువులు బాసిన అమరుల మాసంగా జరుపుకుందాం. శాస్త్రియ విద్య కోసం, సమసమాజం కోసం అసువులు బాసిన విప్లవ యోధులందరికి పిడిఎసు విజృంభణ విప్లవ జోహార్లు అర్పిస్తుందిఅన్నారు. నేడు విద్య కషాయి కరణ అవుతుంది. విద్యార్థుల మేదళ్ళల్లో కులం. మతం జోప్పించే కుట్రలు సాగుతున్నాయి. కులమత రహిత సమాజమే. మానవభివృద్ధి క్షేమం.
విద్య రంగం నేడు పాలకులఅవినీతి చర్యల వల్ల అనేక అసౌకర్యలను ఎదుర్కొంటుంది. కొట్లాది రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించడం లేదు. నాణ్యత కలిగిన భవనాలు, లేక అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ భవనాల్లో హాస్టల్ లు కొనసాగుతున్నాయి. అనేక హాస్టల్ భవనాలుశిథిలా వస్థలో నడుస్తూ విద్యార్థులకు నరకప్రాయం గా మారినాయి. భోజన, విద్యుత్, నీటి, వసతులు కూడా అంతంతా మాత్రమే ఉన్నాయి. విద్యారంగా పరి రక్షణ కోసం కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల, రంగవల్లి, వీరన్న, మధుసూదన్, ల ఆశయల దారిలోమునుముందుకు సాగుదాంఅని పిలుపునిచ్చారు.
నవంబర్10-2025న సూర్యాపేట జిల్లా నకిరేకల్ లో జరుగుఅమరులసభ జయప్రదంచేయాలనీ పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో పిడిఎసు (విజృంభణ) విద్యార్థి నాయకులు ఆదిత్య, అంజన్న, విగ్నేష్, కార్తిక్, బన్నీ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


