త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు అన్నపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట, జానికిపురం,రంగాపురం గ్రామాన్ని స్వయంగా సందర్శించి పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగే పనులను గమనించిన ఆయన నాణ్యతగా వేగంగా పనులు కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు ప్రతి ఇంటి నిర్మాణంలో నాణ్యత అత్యవసరమన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హుడికి సురక్షితమైన నివాసం కల్పించడమని ఆ లక్ష్యం నెరవేరే క్రమంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం అదే గ్రామంలో పలువివాహ వేడుకలో పాల్గొని నవ దంపతులను దీవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


