Cyber ​​Attack : రుణాలిచ్చే యాప్‌పై సైబర్ దాడి.. రూ.49 కోట్లు మాయం

TRINETHRAM NEWS

Trinethram News : Oct 27, 2025, విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన మనీవ్యూ యాప్‌పై అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా, యాప్ ఏపీఐ కీని ఉపయోగించి కేవలం మూడు గంటల్లో 653 నకిలీ ఖాతాల్లోకి రూ.49 కోట్లు బదిలీ చేసింది. ఈ కేసులో బెళగావికి చెందిన ఇస్మాయిల్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని బెంగళూరు సీసీబీ అరెస్టు చేసింది. దుబాయ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ దాడికి సూత్రధారిగా గుర్తించారు. అధికారులు రూ.10 కోట్లను ఫ్రీజ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyber ​​attack on lending app

You cannot copy content of this page

Scroll to Top