Trinethram News : తిరుపతి జిల్లా పోలీస్ శాఖ..
- మొంథా’ తుఫాన్ ప్రభావం – ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
- వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 27 నుండి 28 వరకు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తిరుపతి జిల్లాపై ఉండే అవకాశం ఉంది.ఈ రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశమున్నందున, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ ముఖ్య సూచనలు:-
ఇంటికే పరిమితం అవ్వండి:-
- అత్యవసర పరిస్థితులు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షంలో బయటకు వెళ్లవద్దు. అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోండి.
పిల్లల భద్రత:-
- తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించి, నీరు చేరిన ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు వంటి ప్రదేశాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జల ప్రమాద హెచ్చరిక:-
- వాగులు, వంకలు, నదులు ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సరదాగా ఈత, స్నానం కోసం నీటిలో దిగకూడదు. ఈ విధంగా ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు:
- గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు వర్షాల సమయంలో ఆ ఇళ్లలో ఉండకూడదు.అధికారులు సూచించినప్పుడు వెంటనే పునరావాస కేంద్రాలు లేదా బంధువుల ఇళ్లకు తరలివెళ్లండి.
రెండు రోజుల సన్నద్ధత:-
- అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, టార్చ్ లైట్లు, మందులు మొదలైనవి ముందుగానే సిద్ధం చేసుకోండి.
అత్యవసర సహాయం కోసం:-
- ఏదైనా ప్రమాదం గమనించినా, విద్యుత్ వైర్లు తెగిపడినా, చెట్లు కూలినా, నీరు ఇళ్లలోకి చేరినా వెంటనే సమాచారం ఇవ్వండి.112 – అత్యవసర హెల్ప్‌లైన్.
వదంతులపై ఎస్పీ హెచ్చరిక:-
- “ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా, తుఫాన్ తీవ్రతపై తప్పుడు సమాచారం లేదా వదంతులు సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి) పంచుకునే వ్యక్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.ఈ విపత్తు సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.”
- ప్రజల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించి, సహకరించగలరని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


