దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 27 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం మొద్దుగుల మల్లేపల్లి గ్రామంలో శ్రీ కూర్మ చల సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహం పొందాలి అని ఆయన అన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,మాజీ సర్పంచ్ మర్ల వెంకటయ్య,విజయరాంరెడ్డి, శ్రీనివాస్, రమేష్,మోతిరాం నాయక్,తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


