MLA Jare visited Reddygudem : రెడ్డిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇళ్ళ నిర్మాణాలు పరిశీలిస్తున్న సమయంలో గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి కీలక సమస్యను తీసుకువచ్చారు.ఇళ్ళ నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల పనులు ముందుకు సాగడం లేదని వారు మొరపెట్టుకున్నారు.
గ్రామస్తుల విన్నపంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇసుక సరఫరాలో ఉన్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామస్తులు తమ కమ్యూనిటీ హాల్‌కు సీసీ రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే చేయిస్తామని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా సమస్యల పరిష్కారంపై ఆయన ఇచ్చిన హామీలు, తక్షణ స్పందన పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉమ్మల లచ్చిరెడ్డి, ఉమ్మల కొమ్మిరెడ్డి, ఉమ్మల జాపిన్ రెడ్డి, చిప్పల శ్రీనివాస్ రెడ్డి, పెనునల్లి రవి కుమార్, బైట గోపాల్ రావు, ఉమ్మల రాజి రెడ్డి, కోర్సా దాసు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana visited Reddygudem village

You cannot copy content of this page

Scroll to Top