కాకినాడ జి జి హెచ్ సెక్యూరిటీ గార్డ్స్ నూతన కమిటీ ఎన్నిక…
త్రినేత్రం న్యూస్, కాకినాడ అక్టోబర్ 25 ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మరియు, సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం కాకినాడ 8వ. మహాసభ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కె.వి రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాటిపాక మధు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బి స్వామి బాబు, కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు కే మోహన్ రావు లు హాజరయ్యారు. ఈ మహా మహాసభ లో వారు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ గాడ్స్ సర్వీసెస్ కాంట్రాక్టర్ 138 జీవో ప్రకారంగా సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు మంజూరు చేయాలని, జీవో ప్రకారంగా 16,800 మంజూరు చేయాలని వారన్నారు. మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
యూనియన్ గౌర అధ్యక్షులుగా తోకల ప్రసాద్, అధ్యక్షులు:కె.వి.రామయ్య, వైస్ ప్రెసిడెంట్:ఎం.రాజేంద్ర రావు (జాన్ బాబు) ఉపాధ్యక్షులు: పితాని రమణమ్మ,కోనాడ శ్రీవల్లి,షేక్ మీరాభి, ప్రధాన కార్యదర్శి నేకూరిఅనిల్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి: నాయుడు అప్పారావు, కార్యదర్శిలు: కేసనకుర్తి వెంకటేష్,ఆవల లోవ కుమారి, కోశాధికారి:డేగల మధు. 23 మందిని సమితిని ఎన్నుకోవడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


