MLA Vegulla : ఇదే ఆఖరి అవకాశం

TRINETHRAM NEWS

గొల్లపుంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోతే రద్దే…

సగం సగం కట్టి వదిలేసినా రద్దే…

అద్దెలకు ఇచ్చినా రద్దు చేస్తాం…

రద్దు చేసిన స్థలాలను అర్హులైన పేదవారికి అందజేస్తాం…

అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 22, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట గొల్లపుంత వద్ద గతం లో వ్యక్తిగత స్థలాలుగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నేటికి ఇళ్ళు నిర్మించుకోకపోతే వాటిని రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు అందివ్వడం జరుగుతుందని, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో, నిర్వహించిన, అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం అక్కడ 14 సంవత్సరాలు క్రితం 1996 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీరిలో 191 మంది ఇప్పటి వరకు అసలు ఇంటి నిర్మాణమే మొదలు పెట్టలేదన్నారు. వీరందరి ఇళ్లను రద్దు చేయడం, జరుగుతుందన్నారు. అలాగే 462 మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టి గుమ్మా లు ఎత్తువరకూ, స్లాబ్ ఎత్తు వరకూ సగం సగం నిర్మాణాలు చేసి వదిలేశారన్నారు. వీరందరి ఇళ్లను రద్దు చేయడం జరుగుతుందన్నారు.

అదే విధంగా మరో 583 ఇళ్లల్లో ఇళ్ళు నిర్మించినప్పటికీ యజమానులు కాకుండా అందులో ఇళ్లు కొనుగోలు చేసుకున్న వారో లేక అద్దె కు ఉంటున్న వారో ఉంటున్నారన్నారు. వీరి ఇళ్లను రద్దు చేసి అందులో ప్రస్తుతం ఉంటున్న వారు అర్హులైతే వారికే కొత్తగా ఇంటి పట్టాను మంజూరు చేసి వారికే అందివ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ సదరు ఇళ్లల్లో నివాసం ఉంటున్నప్పటికీ వారికే ఇప్పటికే వేరొక చోట ఇల్లు ఉండి ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. స్థలాలు ఇచ్చి 14 ఏళ్ళు గడుస్తున్నా నేటికి వారు అక్కడ నివాసం ఉండటం లేదంటే వారికి ఆ ఇల్లు అవసరం లేదని, వారు అనర్హులని భావించాల్సి ఉంటుందన్నారు. అయితే చిట్ట చివరిగా ప్రజలకు ఒక అవకాశం ఇస్తున్నామని, ఇప్పటికైనా సదరు ఇళ్లల్లో అసలు యజమానులు ఉండకపోతే వాటిని రద్దు చేసి వేరొకరికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరైనా యజమానులు ఇప్పటి వరకు అక్కడ నివాసం ఉండని పక్షంలో తక్షణం వారు తహశ్శిల్దార్ కార్యాలయానికి విచ్చేసి తగిన కారణాలు వెల్లడిస్తూ తహశ్శిల్దార్ కు వివరణ ఇచ్చుకోవాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

This is the last chance

You cannot copy content of this page

Scroll to Top