తేదీ : 22/10/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చిలకలూరిపేట మండలం లో ఉన్నటువంటి యాభై రెండు ఎకరాలు టీడ్కో గృహాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు, ఆధారాలు లేనటువంటి తొంభై కి పైగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేసామని డీఎస్పీ, సీఐ, ఎస్సై తెలిపారు. ఆ నివాస గృహాల్లో ఎవరెవరు ఉంటున్నారు అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు.
అసంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడిన, మారనాయుధాలు వాడిన వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి ఉత్పత్తులను స్మగ్లింగ్ చేస్తే ఎంతటి వారినైనా వదిలేదే లేదు అని డీఎస్పీ హనుమంతరావు పేర్కొన్నారు. సంఘ నిద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయా? లేదా! అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కార్డెన్ సెర్చ్ లో వందమంది పోలీస్ సిబ్బంది, ఏడు గురు ఎస్సైలు, సిఐలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


