Trinethram News : Oct 20, 2025, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కార్గో కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముడిసరకు, వస్త్రాలు కాలిపోవడంతో వస్త్ర పరిశ్రమకు సుమారు రూ.8700 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎగుమతులు, దిగుమతులు జరిగే కీలక సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది, 40 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఘటనతో ఇతర దేశాలకు ఎగుమతుల్లో ఆలస్యం జరుగుతుందని తయారీదారులు ఆందోనకు గురవుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


