మడికి(చిలకలపాడు)లో దారుణం
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 15. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకపాడులో చోటుచేసుకుంది.వివారాల్లోకి వెళ్తే సెలూన్ షాప్ నిర్వహించే పావులూరి కామరాజు (చంటి)(36) భార్య నాగదేవి సుమారు అయదేళ్లక్రితం ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు నుంచి కేసు కోర్టులో నడుస్తుంది.ఇటీవలనే రాజీ కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఏమైంది ఏమో తెలియదు కానీ బుధవారం రాత్రి అయిదవ తరగతి చదువుతూ అభిరామ్(11) ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్( 8 )లకు పురుగులు మందు పట్టించి అనంతరం ఫ్యాన్ ఉరివేసుకుని చంటి ఆత్మ చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య కారణాలు కూడా వీడియో చేసినట్లు తెలుస్తుంది. దీనిపై రావులపాలెం రూరల్ సిఏ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి నరేష్ లు విచారణ చేయి పెడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


