గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ లీడర్లు ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్బాబు, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అంతర్గాంలో గల 591 ఎకరాల స్థలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం ప్రీ – ఫీజిబులిటీ స్టడీ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లింపులు చేయడంలో ఎంపీ కీలకంగా పనిచేశారని లీడర్లు తెలిపారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ఎయిర్ పోర్టు స్థల పరిశీలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడానికి ఎంపీ కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ లీడర్ కామ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లీడర్లు అనుమాన శ్రీనివాస్ (జీన్స్), ఎండి రఫీక్, వాసర్ల సురేందర్, హకీమ్, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, రాకేష్, జావెద్, శ్యామ్ సుందరాచారి, కిషోర్, మధు, మహేష్, శ్రీకాంత్, శ్రీను, విజయ్, శేఖర్, మహేందర్, అశోక్, సర్దార్, శ్రావణ్, సతీష్, అధిక సఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


