గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు జాతీయ తపాలా దినోత్సవం పురస్కరించుకొని పోచారం మున్సిపాలిటీ పరిధిలో వెంకటాద్రి టౌన్ షిప్ పోస్ట్ ఆఫీస్ లో పని చేస్తున్న బిపిఎం నంద కిషోర్, పోస్ట్ మెన్ లు జితేందర్,సౌజన్య లకు ఎండనక, వాననక ప్రతి క్షణం ప్రజలకు సమాచారం అందింస్తున్న వీరిని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శాలువలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇండియా పోస్టల్ శాఖ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ముందుకు కొనసాగుతుంది.లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తూ ప్రజలకు ఉత్తరాలు చేరవేయడం కాకుండా,పొదుపు, భీమా సౌకర్యాలు కల్పిస్తుంది.పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ సేవలు,లైఫ్ సర్టిఫికేట్, స్పీడ్ పోస్ట్, లాజిస్టిక్ సేవలు అందిస్తుంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ధరకు పార్సిల్స్, అందించడంలో తపాలా ఉద్యోగుల సేవల అనిర్వచనీయం. కావున తపాలా ఉద్యోగులను గౌరవించడం, వారికి సముచిత స్థానం కల్పించడం ప్రజల బాధ్యత గుర్తించాలని తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య,ఎం.రాజనర్సు,సర్జిత్ సింగ్,బంగారి మల్లయ్య,సత్యనారాయణ,,ప్రతాప్ సింగ్,రామిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


