తేదీ : 09/10/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కలెక్టర్ రేట్ లో ఉప్పాడ మత్స్యకారులతో మాట మంతి కార్యక్రమం లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు భీమా చెక్కులు అందించారు. పద్దెనిమిది కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షలు చొప్పున బీమా సాయం అందింది. వాళ్లు తెలియజేసిన ప్రతి సమస్యను , వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ ప్రాంతం పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని, సంబంధించిన పిసిబి అధికారులను ఆదేశించారు.
వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వంద రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటాము, పరిష్కార మార్గాలు సూచించే ప్రక్రియలో పరిశ్రమలు, మత్స్యశాఖ , పి సి బి, పరిశ్రమల ప్రతినిధులు, మత్స్యకారులు , ఎన్డీవోలు, అందరినీ భాగం చేస్తామని తెలిపారు. ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి అందరూ అభినందనలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


