త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు ఉదృతంగా కృషి చేసి మండలంలో గులాబీ జెండా ఎగరవేయాలని బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ను 100 శాతం కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల్లో వెన్నులో వణుకు పుట్టేలా ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం నిస్వార్థంగా పని చేయాలని కోరారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, తెలంగాణ ప్రజల 50 ఏళ్ల గోసను తీర్చిన కారణ జన్ముడు కేసీఆర్ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మహిళలకు రూ. 2500, తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ ఎంపీపీ మాట్లా నాగమణి సహా పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


