Lightning Strikes House : పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ములకలపల్లి మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి, మూకమామిడి గ్రామంలో పిడుగు పడింది. కుప్పాలా, మల్లికేశ్వరరావు ఇంటిపై సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా పిడుగు పడటంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పిడుగుపాటు సమయంలో ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా నష్టపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, మూకమామిడి ప్రజలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lightning strikes house

You cannot copy content of this page

Scroll to Top