KTR : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.. వారి వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి వారికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరాము.. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లుకు ఆటో సంక్షేమం బోర్డు పెట్టి సంవత్సరానికి 12 వేలు ఇస్తామన్నారు, ఆటో మీద ఉన్న చలాన్లు 50 శాతం మాఫీ చేస్తామని చెప్పారు.. ఏపీలో ఎన్నికలు మనకి జరిగిన 6 నెలల తర్వాత జరిగినప్పటికీ.. ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ ఆటో డ్రైవర్లకు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తున్నారు

కానీ ఈరోజు దాక కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడట్లు ఉన్నది తప్ప.. ఉలుకు లేదు పలుకు లేదు.. ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు అనౌన్స్ చేసి.. నెలకు వెయ్యి రూపాయిలు ఇవ్వాలి.. రెండేళ్లకు గాను ఆటో డ్రైవర్లకు పడ్డ 24 వేలు బాకీ పైసల్ ఇవ్వాలి.. చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి – కేటీఆర్…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

auto drivers across the state are suffering

You cannot copy content of this page

Scroll to Top