Trinethram News : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థులకు తర్వాతి కౌన్సెలింగ్లలో ఆలిండియా కోటాలో అదే కళాశాలలో సీటు వస్తే వారికి విశ్వవిద్యాలయ ఫీజు మినహాయింపు ఉంటుందని విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. “ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి రూ.10,600 ఫీజు చెల్లించాలి. ఇప్పుడు ఈ మినహాయింపునకు సంబంధించి ఆయా వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు కేటాయింపు పత్రాలు అందజేయాల్సి ఉంటుంది” అని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


