వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒక్క స్టేజికి ఏకంగా రూ.5/- నుంచి రూ.10/- వరకు అదనపు ఛార్జీ వసూలు రేపటి నుండి చేయటమంటే పట్టణ ప్రజల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే. ఉపాధి కోసం నిత్యం జంట నగరాల్లో ప్రయాణించే పేద ప్రజలపై ఈ బారాన్ని మోపడం సరికాదు.రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం పేదల జేబులను కొల్లగొట్టేలా ఉంది. ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఈ సమయంలో ప్రయాణికుడిపై ప్రతి నెల మరింత అదనపు భారం మోపడం అత్యంత దుర్మార్గం.
ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసి బారాన్ని మరో రూపంలో సామాన్య ప్రయాణికుల మీద మోపి వారి నడ్డి విరచాలని చూడడం సరికాదు. ఓ పక్క ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించి మరో పక్క అదనపు ఛార్జిల రూపంలో వసూలు చేస్తుంటే ఇక ప్రజలకు ఉచితంగా చేసిందేముంది. సామాన్యుడి ప్రయాణం మీద ప్రభుత్వం మోపనున్న ఈ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి.అని బి ఆర్ ఎస్ పార్టీ వికారాబాద్ మాజీ ఎమ్మెళ్లే మెతుకు ఆనంద్ అన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


