Dussehra Festival Bonus : గుమాస్తా కార్మికులకు దసరా పండుగ బోనస్ ఇవ్వాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆల్ షాప్ గుమస్తాల సంగం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో వెంకటేశ్వర్ల అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుమాస్తాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వరంగల్లో వివిధ షాపులలో పనిచేస్తున్న గుమస్తా కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ప్రస్తుతం ఇస్తున్న వేతనం మీద ఒక సంవత్సరం బోనస్ ఉచితంగా ఇవ్వాలని కోరారు కొంతమంది యాజమాన్లు సానుకూలంగా స్పందిస్తూ బోనస్ ఇస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది గుమాస్తా సోదరీ సోదరీమణులకు యాజమాని వద్ద పనిచేస్తున్నారు గుమాస్తాలకు పనిచేస్తున్నట్లుగా ఎలాంటి గుర్తింపు లేదు యాజమాన్లు నుండి బోనస్ సర్వీస్ ఇతర బెనిఫిట్స్ మరియు ఈఎస్ఐపిఎఫ్ బోనస్ సర్వీసు ,

ఎస్ ఫామ్స్ సౌకర్యములు కల్పించడం లేదు రోజుకు 10 నుండి 12 గంటలు పని చేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు ఇస్తూ కార్మికుల చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు అన్నారు నిత్యవసర సరుకుల సరుకుల ధరలు పెరగడం మూలంగా ఇచ్చే జీతం సరిపోక కుటుంబాలను పోషించుకోలేక దుర్భరమైన జీవితాలు గడిస్తున్నారు జీతము పెంచమని అడిగితే ఉన్న జీతాన్ని తగ్గించి టార్గెట్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు మహిళా కార్మిక సోదరులకు అతి తక్కువ వేతనాలు 5000/- నుండి 8000 రూపాయల వరకు ఇస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు జీతం పెంచమని అడిగితే పెంచకుండా ఇస్తున్న జీతాన్ని తగ్గిస్తూ నీ ఇష్టం ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపొమ్మని యజమానులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు యాజమాన్లకు అనుకూలంగా చట్టాలు తిరగ దో డుతూ కార్మికులను నూతన బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు కార్మికుల హక్కులను కాపాడడం కోసం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కే. రమేష్.జి నరేందర్. శ్రీనివాసు.కుమారస్వామి సంతోష్.రమ. సుజాత వాణి. పుష్ప. పద్మ.సరిత అనిత.సాంబశివ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dussehra festival bonus

You cannot copy content of this page

Scroll to Top