MLA Inspects Bathukamma : తెలంగాణ సంస్కృతికి ప్రతీక సద్దుల బతుకమ్మ వేడుకలు పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద సోమవారం రోజున బతుకమ్మ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలోకాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలను అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో స్థలాలు చదును చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు.

మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయరమణ రావు పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగల సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఎ.ఈ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Peddapalli MLA inspects Bathukamma celebrations

You cannot copy content of this page

Scroll to Top