Pensioners Association : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం ఏకగ్రీవంగా ఎన్నికలు

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. స్థానిక దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2025-2028 మూడు సంవత్సరాల కాలమునకు ఎన్నికలు సేవాసధనంలో జిల్లా నాయకులు జెల్ల శ్రీశైలం, ఆంజనేయులు, నూనె రంగయ్య, మోహనరావు, కంచర్ల నారాయణ రెడ్డి గారల సారథ్యంలో జరిగినవి. గత కమిటి అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగనూరు లింగయ్య సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, పడమటి శాంతకుమారి, సహాయ కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, జిల్లా కౌన్సిలర్స్ తాడిశెట్టి సుదర్శన్, బొలుసాని సత్యనారాయణ గారలు ఏకగ్రీవముగా ఎన్నిక కాబడినట్లు జిల్లా నాయకులు ప్రకటించినారు.

ఈ సందర్బంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ దేవరకొండ యూనిట్ చక్కటి కార్యక్రమాలు మరియు చక్కటి భవనము నిర్మించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైన సంఘంగా పేరూపొందినారు అన్నారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులను శాలవాలతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, సభ్యులు 100మంది పాల్గొన్నారు. నూతన కార్యవర్గమునకు జిల్లా, రాష్ట్ర, పాలుగొన్న సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినది. పసందైనా భోజనాలు ఏర్పాటు చేసినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devarakonda Government Pensioners Association

You cannot copy content of this page

Scroll to Top