డివైజెఏసి రాష్ట్ర చైర్మన్ బహుజన మేధావి వ్యాసకర్త న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్.
దేవరకొండ సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఉన్న కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డివైజేఏసీ రాష్ట్ర చైర్మన్ బహుజన మేధావి వ్యాసకర్త న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ పాల్గొని మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల్లో ఏ ఒక్క మండలం కూడా జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఎస్సి లకు కేటాయించకపోవడం చాలా దారుణమాని నియోజకవర్గం లో ఎస్సి జనాభా లక్ష్యకు పైగా దాదాపు యాభై వేల ఓటర్లకు పైగా ఉన్న ఎస్సి జనాభాకు దేవరకొండ నియోజకవర్గం లో రెండవ స్థానంలో ఉన్న ఎస్సి జనాభాకు ఒక్క స్థానాన్ని కేటాయించకపోవడం ఎస్సి లను అన్యాయం చెయ్యడమే అవుతుంది అని దేశానికిస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఎస్సి లను రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నియోజకవర్గం లో రోటేషన్ పద్దతిలో ఇప్పటి వరకు ఎస్సి లకు అవకాశం రాని మండలాలు చాలా ఉన్నాయి అని అయినా కూడా ఎస్సి సమాజాన్ని రాజకీయంగా సమాధి చేసే విదంగా నేటి ప్రకటన ఉందని స్థానిక పోరులో ఎస్సి ల ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చెయ్యడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని తెలిపారు. నేడు ప్రకటించిన స్టానిక రిజర్వేషన్ లను పునః పరిశీలన చేసి నియోజకవర్గం లో ఎస్సి లకు జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు కేటాయించాలని అధికారులను ప్రజాప్రతిని ధులనువిజ్ఞ ప్తిచేశారు ..గతంలోకూడా స్థానికంగా ఉన్న అధికారులను కలిసి నియోజకవర్గం లో ఉన్న ఎస్సి లకు జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని లిఖిత పూర్వకంగా వివరించడం జరిగింది అని అయినా కూడా ఎస్సి లను గతంలో లాగానే అన్యాయం చేయడం సరికాదు అని తెలిపారు లేనియెడల భారీ నిరసనలు,ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


