Chakali Ailamma Jayanti : రామగుండం కమీషనరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు, దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ , ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chakali Ailamma Jayanti Celebrations

You cannot copy content of this page

Scroll to Top