దుళ్ల లో రైతులే చేసుకుంటున్న రోడ్ పటిష్టత పనులు…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కడియం, సెప్టెంబర్ 24 కడియం మండలం దుళ్ల శివారు లోని కాలువ వద్ద అక్విడెక్టు తరచూ పూడుకు పోవడం తో పాటు ఆ ప్రాంతంలో రోడ్డు కుంగి పోతోంది..బుధవారం రైతులే నడుం బిగించి ప్రొక్లెయిన్ తో అక్విడెక్టు శుభ్రత తో పాటు రోడ్ పటిష్టతా పనులు చేపట్టారు…ఈ పనులు చేపట్టిన రైతు నాయకులు చిట్టూరి వెంకన్న చౌదరి, యన్నమని పెదనాని, కంటిపూడి శ్రీనివాస్, యన్నమని పట్టాభి, జమీందారు, కంటిపూడి రాము, గారపాటి సత్య నారాయణ, వై. శ్రీరామచంద్రమూర్తి లు మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రభుత్వాలు రైతు సంక్షేమ మే ధ్యేయంగా పని చేస్తున్నామని బాకాలు కొట్టుకుంటుంటే , ముంపు నీరు బయటకు పోయే అక్వేడెక్టు లను పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. సుమారు వెయ్యి ఎకరాలు ఆయకట్టును ముంపు నుంచి కాపాడుతూ దుళ్ల శివారు మడికి నుంచి వచ్చే కాలువ అడుగు భాగం లో బ్రిటిష్ కాలం నాటి అక్విడెక్టు నిర్మాణం జరిగిందని రైతు నాయకులు చెబుతున్నారు..
అయితే ఈ నిర్మాణం పైన ఉన్న పుంత రోడ్ లో గతంలో కేవలం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, సైకిళ్ళు, మోటార్ వాహనాలు వంటివి మాత్రమే ప్రయాణం సాగించేవని రైతులు అంటున్నారు అయితే ఇటీవల ఈ ప్రాంతంలో నర్సరీ మొక్కల హెవీ లోడ్ తో లారీలు ప్రయాణం సాగిస్తున్నాయన్నారు. దీంతో రోడ్ కృంగి ఆక్వేడెక్టు నిర్మాణం దెబ్బతిని పూడుకు పోవడంతో పాటు పైన ఉండే రోడ్ భారీ గుంతలు పడుతున్నాయని వాపోతున్నారు.. దీనివల్ల అక్విడెక్టు కుంగి పోయి వరి పొలాల్లో ముంపు నీరు ముందుకు పారక పంట పాడవుతుందని రైతులు వాపోతున్నారు. ఆలమూరు మండలం మడికి నుంచి కడియం మండలం దుళ్ల మీదుగా ఏడిద వైపుకు వెళ్లే ఈ పంట కాలువలో చెంతనే ఉన్న కొద్ది మంది నర్సరీ రైతులు ఎండిన, చెత్త మొక్కలను ఈ కాలువ వెంబడి పారబోయడం బాధాకరమన్నారు.. దీని వల్ల కాలువ మూతబడి పంటలకు నీరు ముందుకు సాగడం లేదన్నారు..అలాగే ఆయా గ్రామాల్లో చెంతనే ఉన్న మురికి నీటి డ్రైన్లు ఈ కాలువలోకి వదిలేయడం, మరికొంతమంది గేదెలు మకాంలు, వంటి వాటితో ఆక్రమణలకు పాల్పడడం రైతుల పాలిట శాపంగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు..
వేలాది ఎకరాల పంట పొలాలకు ఆలవాలమైన ఈ పంట కాలువను పట్టి పీడిస్తున్న సమస్యలు తో పంట, నాశనం, అయి నష్టాలు బారిన పడుతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతంలో పంట సెలవు ప్రకటించాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్యలపై ఇరిగేషన్, డ్రైనేజీ బోర్డ్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించు కునే వారు కరువయ్యారన్నారు. అలాగే ఈ పంట కాలువలో పెరుగుపోతున్న స్కిల్ట్, చెత్తా చెదారాన్ని తొలగించడానికి , మట్టి పూడిక తీయడానికి రైతులు , కొలగారం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.. దీనిపై దుళ్ల పంచాయతీ కి వినతి పత్రం అందజేసామని ఆఖర్చులో కొంతైనా పంచాయతీ భరించి రైతులకు ఆర్ధిక భారాన్ని తగ్గించాలని రైతులు కోరుతున్నారు. ప్రతీ ఏటా రైతులే తమ సొంత ఖర్చులు తో ఈ పనులు చేపట్టు కోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన శాశ్వత పటిష్ట చర్యలు తీసుకోవాలని, పంటల సాగుకు ఎంతో ఉపయోగ పడే ఇలాంటి పురాతన కట్టడాలు, అక్విడెక్టు లను సంరక్షించు కోవాలని రైతులు కోరుచున్నారు… దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు తప్పుంచుకుంటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానుకో పోతే రైతులంతా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


