Pittala Arjun :గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా లో ఎంపీడీవో అప్పారావు కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, వేతనాలు పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటప్పయ్య, వినోద్, ముత్తారావు, పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pay pending salaries

You cannot copy content of this page

Scroll to Top