తేదీ : 16/09/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); వైసిపి అధినేత , శాసనసభ్యులు జగన్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్డారు. ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన కనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్దతు ధరలు, రైతులు గురించి మాట్లాడే కనీస అర్హత రెడ్డికి లేదన్నాడు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలని, ఉల్లి, టమాట దీనస్థితి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని అని అన్నారు. ప్రజలు, అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


