Vinayaka immersion festival : భక్తి ఆరాధనల నడుమ ముగిసిన వినాయక నిమజ్జన ఉత్సవం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా, అరకులోయ – ఆగస్టు 28 (త్రినేత్రం న్యూస్): అరకువేలీ మండలం, చోంపి పంచాయతీ పప్పుడువలస గ్రామంలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామస్తులు స్వామివారిని ఊరేగింపుగా శోభాయాత్రగా తీసుకువెళ్లి, పాటలు, నృత్యాలతో ఉత్సవానికి ఆభరణం వేశారు.
నిమజ్జన వేడుకలో పెద్దలు, యువత, చిన్నపిల్లలు అందరూ ఒకే తాటిపైకి వచ్చి పాల్గొనడం విశేషం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. స్వామివారి లడ్డు వేలంపాట ఉత్సాహంగా సాగింది. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోవడంతో నవరాత్రి ఉత్సాహాన్ని తలపించే వాతావరణం నెలకొంది.
ఈ ఉత్సవం సమాజంలో ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమంలో గ్రామస్తులు సత్యనారాయణ, నందీశ్వరరావు, సింహాచలం, అప్పలనాయుడు, కొండలరావు, రాము, చింటూ, కోటేశ్వరరావు, గౌరీనాయుడు, త్రినాధ్, రాకేష్, చిన్న, పెద్ద ,మోహన్ సాయి, అజ్జి, దిలీప్ వర్ధన్, రామారావు, దీపు, త్రినాధ్, (త్రినేత్రం న్యూస్ రిపోర్టర్ రాజు) బాలు, సూరిబాబు, చందు, రాంబాబు, పెంటయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
వైభవోపేతంగా జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలు భక్తి ఉత్సాహాలతో విజయవంతంగా ముగించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vinayaka immersion festival

You cannot copy content of this page

Scroll to Top